శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. నిందితుడు తన జీన్స్ పాయింట్లో బంగారంను పేస్ట్‌గా మార్చి తరలిస్తూ
అధికారులకు చిక్కాడు. ఇండిగో విమానంలో షార్జా నుంచి ఈ రోజు హైదారాబాద్ వచ్చిన లక్నో వాసి వద్ద ఈ బంగారం పట్టుబడింది. తనిఖీలు చేస్తున్న డీఆర్ఐ అధికారులు బంగారం అక్రమ రవాణాను గుర్తించి పట్టుకున్నారు. కాగా... పట్టుబడ్డ బంగారం విలువ రూ.24 లక్షల 64 వేలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.