నల్లగొండ: నల్లగొండ బస్టాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు బస్సులు కదలకుండా డిపోను ముట్టడించారు. బస్సులకు కార్మికులు
అడ్డంగా పడుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు ఆందోళన చేస్తున్న కార్మికులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిరసన చేస్తోన్న 30 మంది కార్మికులతో పాటు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.