విశాఖపట్టణం: విశాఖలో భారీగా గంజాయి పట్టుబడింది. తుమ్మలపల్లి గ్రామంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 కిలోల గంజాయిని
అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆటోలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే... వారి వద్ద నుంచి రూ.33 వేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులు కూడా యూపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.