రంగారెడ్డి: జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం గండిపేట మండలం కిస్మత్పూర్లో ఇళ్లలోకి చొరబడిన దుండగులు ముగ్గురు మహిళల
మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. మహిళలు అరవడంతో అప్రమత్తమైన స్థానికులు దొంగలను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం స్వాధీనం చేసుకుని మహిళలకు అంద చేశారు.