కడప: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు... జిల్లా ఎస్పీ అన్బురాజన్. ఎవరైనా అబద్ధపు వార్తలు, ప్రచారం చేస్తే
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొద్దుటూరు సునీల్ గ్యాంగ్‌తో శ్రీనివాస్‌రెడ్డికి సంబంధాలున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. అయితే... వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయముందన్న వార్తలు అవాస్తవమని ఎస్పీ తెలిపారు. అవాస్తవలను ప్రచురించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.