హైదరాబాద్: ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ...
నిన్న ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కంచన్‌బాగ్ అపోలో ఆసుపత్రి ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు వెళ్లిన పోలీసులు ఆందోళన చేస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలతో హోరెత్తించారు.