ఖమ్మం: జిల్లాలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస రెడ్డి కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరికి
మనస్థాపం చెంది పోట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా... ప్రస్తుతం శ్రీనివాస రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శరీరానికి 90 శాతం గాయాలవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారిందన్నారు. దీంతో శ్రీనివాసరెడ్డిని చూసేందుకు ఆసుపత్రి వద్దకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక నినాదాలతో ఆసుపత్రి మార్మోగింది. ఆందోళనకు దిగిన కార్మికులు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించారు. ఖమ్మం కలెక్టర్ ఎదుట ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.