హైదరాబాద్: నగరంలోని ప్లాస్టిక్ పైపుల గోదాంలో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజే మార్కెట్ వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ పైపుల గోదాంలో షార్ట్ సర్క్యూట్
కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు పైపులకు అంటుకుని భారీగా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.