హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేష్ కుమార్(56) మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఎస్సార్ నగర్ అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో
హత్యకు గురైన ఆయన మృతదేహానికి గాంధీ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం చేసి అనంతరం ఆయన మృతదేహాన్ని ఎస్సార్ నగర్ పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రైమరీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం సురేష్ తలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే... మృతదేహంపై లభించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌కు పంపించారు. మృతుడు సురేష్ పై హోమో సెక్సువల్ జరిగి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సురేష్ కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.