ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని కోలోరియాంగ్ ఎమ్మెల్యే లోకమ్ తస్సార్ కుమారుడు లోకమ్ లులు
డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు బలమైన ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై ఎస్పీ తుమ్మె అమో మాట్లాడుతూ... ‘‘మా విచారణలో ముగ్గురు వ్యక్తులు హెరాయిన్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరింత విచారణ చేపట్టగా వారు లోకమ్ లులు నుంచి హెరాయిన్ కొన్నట్లు తెలిపారు. అందుకే లోకమ్ లులును అరెస్ట్ చేశాం’’ అని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కస్టడీకి పంపినట్లు కూడా ఎస్పీ తెలిపారు.