సూర్యాపేట: హుజూర్నగర్ లో పోలీసులు భారీగా నగదు, మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. మరికొద్ది రోజుల్లో హుజూర్నగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి
మాంద్యం, డబ్బును పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అధికారుల సోదాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.45 లక్షల నగదును... అలాగే... సుమారు రూ.97 వేల రూపాయల విలువచేసే 65 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 118 తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 54 మందిపై బైండోవర్తోపాటు 27 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరులపై అధికారులు నిఘా పెట్టి తనిఖీ చేస్తున్నారు.