విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ప్రసాదం తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ప్రసాదం తయారీ కేంద్రంలో దాదాపు 40 నిండు గ్యాస్ సిలిండర్లు
ఉన్నాయి. అక్కడ దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా... గ్యాస్ లీకును వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదమే తప్పింది. లేకపోతె భారీ నష్టం మిగిలేది. గ్యాస్ లీకును గుర్తించిన సిబ్బంది వెంటనే పైపు లైను మూసేశారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు గ్యాస్ లీకు రిపేర్ పనులు చేస్తున్నారు. కాగా... మెయింటనెన్స్ లోపం కారణంగానే గ్యాస్ లీక్ అయిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలిని ఆలయ ఈవో సురేష్ బాబు పరిశీలించారు.