విశాఖ: ఐబీ జారీ చేసిన హెచ్చరికలతో విశాఖ తీరం ప్రాంతంలో కోస్టల్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసి... కోస్ట్‌గార్డ్, నేవీతో ఎప్పటికప్పడు మెరైన్
పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్ని మెరైన్ డీఎస్పీ వెల్లడించారు. ఏపీలోని 974 కి.మీ తీర ప్రాంతంలో నిఘా మరింత పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మత్స్యకారులకు ఐబీ చేసిన హెచ్చరికలపై సూచనలు జారీ చేశామన్నారు. తీర ప్రాంతం వెంబడి అనుమానితులెవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. నేవీ, కోస్ట్‌గార్డ్, సివిల్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.