తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి చెన్నై వచ్చిన 51 సంవత్సరాల అబ్దుల్ అజీజ్ అనుమానాస్పదంగా కనిపించడంతో
కస్టమ్స్ అధికారులు అతని లగేజి తనిఖీ చేశారు. అతని బ్యాగ్ లో 11 లక్షలు విలువ చేసే 290 గ్రాముల బంగారు కడ్డీలు లభించాయి. అయితే... వాటికి సంబంధించి అతని వద్ద ఎలాంటి ధృవ పత్రాలు లేకపోవడంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.