హైదరాబాద్: తన భర్త, అత్తామామ తనను ఎంతో హింసపెట్టారని రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్ కోడలు సింధు శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె
తనకు 2012 లో పెళ్లి జరిగిన నాటి నుంచి పెట్టిన చిత్ర హింసలను సివిఆర్ న్యూస్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ... నా భర్త, అత్తామామలు కుటుంబసభ్యులతో కలవనిచ్చేవారు కాదు. మామ తన పలుకుబడి ఉపయోగించి నన్ను, నా పుట్టింటి వారిని మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న భర్త వశిష్ఠ అత్త మామ లు నన్ను గొడ్డును బాధినట్టు బాదారు. నన్ను పిచ్చిదానిలా చిత్రీకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. మామ జస్టిస్ నూతి రామ్మోహన్ పలుకుబడితో దర్యాప్తును అడ్డుకున్నారు. ఇంత జరిగినా నా భర్త నా దగ్గరకు వస్తే చాలనుకున్నా. అందుకే ఎన్ని హింసలు పెట్టినా భరించా. ఇప్పుడు నాకు విడాకులు నోటీస్ పంపారు. నాకు న్యాయం కావాలి అంటూ సింధు శర్మ డిమాండ్ చేశారు.