లక్నో: అత్యాచారం కేసులో నిందితుడు, బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద(73) అరెస్ట్ అయ్యాడు. న్యాయశాస్త్ర విద్యార్థిని చిన్మయానందపై చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో
ఆయనను యూపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా... బాధితురాలు తన ఆరోపణలకు ఆధారాలుగా 43 వీడియోలను విచారణ బృందానికి పెన్‌డ్రైవ్‌లో పెట్టి అందజేసింది. పోలీసులకు ఆధారాలు అందచేస్తే చిన్మయానంద తనను తన కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్మయానందను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేకపోతె తాను ఆతహత్యకు పాల్పడుతానంటూ కూడా హెచ్చరించింది. కాగా... ఈ విషయంలో సహాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ను బాధితురాలు కోరింది. దీంతో చిన్మయానందను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్య పరీక్షల కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.