భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం గణనాథుని నిమజ్జనానికి నదిలో ఓ పడవలో తీసుకెళ్తుండగా
ఆ పడవ బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. మృతులు పిప్లానీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా.. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాద సంఘటన ఈ రోజు ఉదయం 4.30 గంటలకు ఖట్లాపూరా ఘాట్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 14 కంటే ఎక్కువమందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.