హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ కోర్టు ప్రాంగణంలో రోజుకో కలకలం రేపుతున్నాడు. మొన్నకోర్టుకు హాజరైన భత్కల్ కోర్టు హాల్ కిటికి నుంచి ఓ లేఖను బయటకు విసిరి తనకు పోలీసుల నుంచి ప్రాణ హాని ఉందని హల్ చల్ చేశాడు.
మరో మారు కోర్టు ప్రాంగణంలో పింక్ గులాబీచేతిలో పట్టుకుని మరో సంకేతాన్ని పంపాడు...ఇప్పుడు మరోసారి నవ్వాడు..ఇలా భత్కల్ రోజుకో సంచలనంతో ఏం మెసేజ్ ఇస్తున్నాడు. దీని ఆంతర్యమేంటి? ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ...ఈ పేరు వింటేనే హైదరాబాద్ జంటపేలుళ్ల విషాదాంతం గుర్తకొస్తుంది. బాంబు పేలుళ్లకు ప్రధాన కుట్రదారుడు. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉన్న భత్కల్ మొన్న రంగారెడ్డి కోర్టులో హల్ చల్ చేశాడు. నిన్న కోర్టు హాల్ కిటికి నుంచి తన జేబులో ఉన్న ఓ లేఖను బయటకు విసిరాడు.
ఈ ఘటన జరిగిన మర్నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో పింక్ గులాబీ చేతిలో పట్టుకుని మరో సంకేతాన్ని పంపాడు...నేడు భారీ బందోబస్తు నడుమ కోర్టు ప్రాంగణం చేరుకోగానే ఓ నవ్వు నవ్వాడు..ఈ సందేశం వెనక వ్యూహం ఏంటి. ఇలా రోజుకో సింబల్ తో సంచలనంగా మారుతున్న భత్కల్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అనే అనుమానాలున్నాయి...ఇప్పటికే భత్కల్ తల్లి తన కొడుకును ఎన్ కౌంటర్ చేస్తారేమోననే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇలా రోజుకో సంచలనం కోసం యాసిన్ భత్కల్ యత్నిస్తున్నాడని తెలంగాణ జైల్ డిజి చెప్పడం విడ్డూరంగా ఉంది.
భారీ బందోబస్తు నడుమ తీసుకొస్తున్న భత్కల్ ను చెకింగ్ చేయకుండా తీసుకురావడం పోలీసు యంత్రాంగం విఫలమవుతలేరా ...లేక కావాలనే భత్కల్ ను ప్రోత్సహిస్తూ తదుపరి కార్యచరణకు స్కెచ్ వేస్తున్నారా అనే అనుమానాలున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న యాసిన్ భత్కల్ ఇతర రాష్ట్రాల్లోని కోర్టులకు హాజరు కావాల్సి ఉంది..అహ్మదాబాద్ కోర్టు కేసుకు కానున్న క్రమంలో ఇలా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న తీరు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే. యాసిన్ భత్కల్ ను సిమి ఉగ్రవాది వికారుద్దీన్ లా ఎన్ కౌంటర్ చేస్తారనే ప్రచారం ఉంది..మరో వైపు యాసిన్ జైలు నుంచి పారిపోయే కుట్ర చేస్తున్నాడనే వాదలో ఏది నిజమవుతుందో.