మహారాష్ట్రలోని థానే నగరంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరో 22 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద మరి కొంతమంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.