తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం బాణాసంచా పేలుడు కలకలం రేపింది.... పలివెల వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.