అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు చిత్రహింసలకు గురయ్యాడు. గుడివాడుకు చెందిన మున్నం లక్ష్మీ రెండేళ్లగా భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.
ఆమె దూరపు బంధువు వడ్డాది అనిల్ కుమార్ తన కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఏప్రిల్ 11న విశాఖకు తీసుకెళ్లాడు. తనతో పాటు నాలుగేళ్ల కుమారుడు జేషన్ ను కూడా తీసుకెళ్లిన లక్ష్మీ...కొడుకుతో ఆపీస్ లోనే ఉంటుంది. జేషన్ ను తన ఇంట్లో ఉంచుకుంటానని తీసుకెళ్లిన అనిల్ కుమార్ భార్యతో కలిసి చిత్రహింసలు పెట్టాడు. ఇదేంటని లక్ష్మీ అనిల్ కుమార్ భార్యను నిలదీస్తే...ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ బెదిరించింది. గుడివాడ వచ్చిన లక్ష్మీ పోలీసులకు పిర్యాదు చేస్తే..ఘటన ఎక్కడ జరిగిందో అక్కడే పిర్యాదు చేయాలన్నారని లక్ష్మీ వాపోయింది.