కర్నూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మానవమృగం.పాతబస్తీలోని ఖడక్ పూరాకు చెందిన తాపీ మేస్త్రీ ఖజాభాషా... శనివారం కాలనీలో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించి తన ఇంట్లో నిర్భందించి అత్యాచారం చేశాడు.
ఆదివారం ఖజాభాషా ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.విషయం తెలుసుకున్న కాలనీ వాసులు నిందితునికి దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.