ప్రజలకు రక్షణగా నిలవాల్సిన హోంగార్డు దొంగగా మారాడు.ఇతర జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే హైదారాబాద్ కు మాకాం మార్చాడు..ఈయనకు మరో ఇద్దరు తోడయ్యారు...వరుసగా ముప్పై బైకులు అపహరించి పంజాగుట్ట పోలీసులకు చిక్కిన పోలీస్ దొంగ పై ఓ కధనం.
కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డు గా విధులు నిర్వర్తించే సంపత్ బిక్షపతి రాజు ఇరవై ఏళ్ల క్రితం వివాహమయింది..ఈయనకు నలుగురు పిల్లలు..అయితే మెదటి భార్య ఉండగానే మరో ప్రేమ వివాహం చేసుకోవటంతో మెదటి భార్య పోలీసులనాశ్రయించింది.దీంతో రాజును కటకటాల్లోకి నెట్టారు.అదే జైళ్లో బైక్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మరో దొంగ రాజుకు పరిచయమయ్యాడు...బెయిల్ పై విడుదలైన అనంతరం ఇద్దరు హైదరాబాద్ కేంద్రంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతూ ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముప్పైకి పైగా బైకులు అపహరించారు.
వైన్స్ లు,బస్టాపులు..ఆస్పత్రులతో పాటు రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బైక్ లు చోరి చేసేవారు..అనంతరం చోరి చేసిన బైక్ లను సొంత అవసరాలకు వాడుకుంటూనే వీరి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో ఇతరులకు అమ్మేవారు..కేవలం పైనాన్స్ డబ్బులు కట్టనందునే బైక్ లు అమ్ముతున్నట్టు కొనుగోలుదారులకు తెలిపేవారు..అయితే పోలీసుల తనిఖీల్లో వాహన నంబర్లు..ఇతరత్రా డాక్యుమెంట్లు లేకపోవటంతో నిఘా ఉంచిన పోలీసులు చివరకు హోంగార్డే నిందితుడని తేల్చి కటకటాల్లోకినెట్టారు..ఈయన వద్ద నుండి పది హేను లక్షలు విలువ చేసే ముప్పై ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులు సంపత్ భిక్షపతి రాజు,అంజయ్య,దేవెందర్ లను రిమాండ్ కు తరలించారు.