కొత్తపేట చైతన్యపురిలోని మోహన్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది అక్కాచెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. యామిని అనే యువతిపై అమిత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
అక్కపై దాడిని అడ్డుకోబోయిన చెల్లెలు శ్రీలేఖపై కూడా దాడి చేశాడు. యామిని అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీలేఖ ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన యామిని నివాసంలో చోటు చేసుకుంది. యామిని తనను ప్రేమించడం లేదనే అక్కసుతోనే అమిత్ ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అమిత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమిత్ కోసం గాలిస్తున్నారు.