ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జీహెచ్‌ఎంసీ కూకట్ పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ అధికారిగా పనిచేస్తోన్న ఇమ్మానియేల్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఇమ్మానియేల్‌పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌లో రూ. 5 కోట్ల విలువైన ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.