కడపలో బాలికలను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టరట్టయింది. కడప రైల్వేస్టేషన్ నుంచి జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందిన 25 మంది బాలికలను అక్రమంగా తరలిస్తుండగా... మహిళా మండలి అధ్యక్షురాలు, పోలీసులు ఈ గుట్టును బహిర్గతం చేశారు.
అమ్మాయిల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులతో కలిసి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సరస్వతి.. గత కేసులకు సంబంధించిన అంశాలపై పోలీసులతో చర్చించేందుకు కడప రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఐతే అక్కడ అనుమానాస్పాదంగా బాలికలు కనిపించడంతో ఆరా తీసిన ఆమె...బాలికల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించగా.., వారి నుంచి పొంతన లేని సమాచారం రావడంతో అనుమాడింది. ఈ నేపథ్యంలో అమ్మాయిలను తరలించే బ్రోకర్ ను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారించగా అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నట్లు వారు నిర్థారించారు. ఇంట్లో పనుల పేరుతో బాలికలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.