మెదక్ జిల్లా సిద్ధిపేటలో దొంగతనానికి వచ్చి ఇరుక్కుపోయాడు దొంగ. సిద్ధిపేట అంబేద్కర్ నగర్ లో ఓ ఇంట్లో వారందరూ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన దొంగ భార్గవ్..
ఇంటిపై నున్న పొగ గొట్టంలో నుంచి ఇంట్లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాడు. తర్వాత రోజు ఇంట్లోవారు వచ్చిన తర్వాత వంటగదిలో పైకి చూస్తే దొంగ కాళ్లు కనబడ్డాయి. పోలీసులకు సమాచారం ఇచ్చి అతనిని రక్షించిన తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=0MOH5_tztIc