జిల్లా అవినీతి నిరోదక శాఖ అధికారులకు రాజేంద్ర నగర్‌లో రూ. 8వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా ట్రెజరీ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ రమేశ్ చిక్కరు. బిల్లు మంజూరు కోసం రమేశ్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన అధికారులు లంచం తీసుకుంటుండగా రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.