బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలిసుల ఆధ్వర్యంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
రోడ్డు నెం .12 లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 20 మందిపై కేసులు బుక్ చేసారు.10 కార్లు , 9 బైకులు, ఒక టాటాఏసిని స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎల్లుండి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని బంజారాహిల్స్ ట్రాఫిక్ సి.ఐ ఉమా మహేశ్వర రావు తెలిపారు.