హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ (39) ఇకలేరు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధ వ్యాధితో పాటు
కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో వేణు మాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనకు వెంటిలేటర్ సాయంతో విఆద్యులు చికిత్స అందించారు. పరిస్థితి మరింతగా విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. కాగా వేణు మాధవ్ కు భార్య, శ్రీవాణి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్ర వేసుకున్న వేణు మాధవ్ మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.