Print
Hits: 674
kajal aggarwal presents manu charitra

స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. సూపర్ హిట్ ఫిల్మ్ 'పెళ్లి చూపులు' చిత్ర నిర్మాత రాజ్‌ కందుకూరి

కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ... తెరకెక్కుతున్న 'మను చరిత్ర' చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు అందుకుంది. ఈ చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. సినిమా కథ నచ్చడంతోనే ఈ సినిమాకి సమర్పకురాలిగా మారానని కాజల్ తెలిపింది.

ఇక... వీర, ధోని, ఉలవచారు బిర్యాని, ఆర్‌ఎక్స్‌ 100 లాంటి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్‌ కుమార్‌ పెదగోని దర్శకత్వం వహిస్తున్నారు. గోపిసుందర్‌ సంగీతం ఆందిస్తుండగా... లై, చల్‌ మోహన్‌ రంగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాశ్‌ ఈ చిత్రంలోనూ కథానాయికగా ఎంపికయ్యింది.

యాపిల్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు కాజల్‌ అగర్వాల్‌ ప్రత్యేక‌ అతిథిగా విచ్చేసి.. క్లాప్‌ కొట్టారు. ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి ఫస్ట్‌ షూట్‌కు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కళ్యాణ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా... ప్రముఖ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ, ప్రముఖ ప్రొడ్యూసర్‌ సాహు గారపాటి సినిమా కథను 'మను చరిత్ర' దర్శకుడు భరత్‌ కుమార్‌కు అందించారు.

e-max.it: your social media marketing partner