Print
Hits: 670
maharshi review

మహేశ్ బాబు హీరోగా నటించిన తన 25వ చిత్రం ‘మహర్షి’ పబ్లిక్ టాక్ వచ్చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ గ దూసుకుపోతోంది.

అయితే... కథలోకి వస్తే, ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు త్రీ షేడ్స్ లో అభిమానుల్ని అలరించాడు. ఫస్టాప్ అంతా కాలేజ్ స్టూడెంట్‌గా సరదాగా కానిచ్చేసిన మహేష్, సెకండాఫ్ లో ఎమోషన్‌తో మెప్పించాడు. కాలేజ్ స్టూడెంట్ గ, ఓ కంపెనీకి సీఈఓ గ, రైతు గ, మొత్తం మూడు పాత్రల్లో అభిమానులని ఎంతగానో మెప్పించాడని ప్రెకషకుల స్పందనను బట్టి తెలుస్తోంది. అయితే... తొలి అర్ధభాగంలో కథని బాగా లీడ్ చేసిన దర్శకుడు, రెండో అర్ధభాగంలో కథని నెమ్మదిగా నడిపించాడని, కొన్ని సన్నివేశాల్లో బోరింగ్ వచ్చిందని పబ్లిక్ టాక్. ఇక హీరోయిన్ గ నటించిన పూజహెగ్దే ఈ చిత్రంలో గ్లామర్ తో పాటు, పలు సన్నివేశాల్లో బాగా నటించిందని ప్రెకషకుల నుంచి వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ వైవిధ్య భరితమైన పాత్ర చేసిన హీరో అల్లరి నరేష్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడని... ఆయన నటన సినిమాకు అదనపు బలమైందని ప్రెకషకుల టాక్. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్... నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్లో నిలిచింది. నిర్మాతలు ఎక్కడ రాజి పడకుండా చిత్రాన్ని ఉన్నతంగా... రిచ్ లుక్ తో నిర్మించారు. దీంతో ప్రతి ఫ్రేమ్ అభిమానుల్ని సినిమాకి కట్టి పడేసింది. ఓవర్ ఆల్ గ ఈ హాట్ సమ్మర్‌లో మహేష్ ‘మహర్షి’ ఓ డీసెంట్ హిట్ అని సినీ ప్రేక్షకులు, అభిమానుల స్పందనను బట్టి తెలుస్తోంది.

e-max.it: your social media marketing partner