Print
Hits: 704

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం ''డియర్ కామ్రేడ్''. సక్సెస్ టాక్ తెచ్చుకున్న జంట

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వడంతో..చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఒక ఫొటోను దర్శకుడు భరత్ కమ్మ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ప్యాకప్ చేశామని పేర్కొన్నాడు. గ్రేట్ జర్నీ, అందరినీ మిస్ అవుతున్నానని దర్శకుడు ట్వీట్ చేశాడు. 

e-max.it: your social media marketing partner