Print
Hits: 715

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్‌ ఓ ఆంగ్ల మీడియాతో ఈ సినిమాపై

తన అభిప్రాయాలను వెల్లడించారు. బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి - ది కంక్లూజన్ సినిమాల కోసం ఐదేళ్లు కేటాయించానని, ఈ ఐదేళ్లలో ప్రతి క్షణం తనకెంతో మధురమైనదన్నారు.  ‘బాహుబలి’ సినిమాల్లో మీరేమన్నా మార్పులు చేయాలనుకుంటే ఏం చేస్తారు? అని విలేకరి అడిగిన ప్రశ్నకు..ప్రభాస్ ఇలా బదులిచ్చారు. ''ఈ సినిమాలతో నాకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు వచ్చింది. అలాంటప్పుడు సినిమాల్లో నేను మార్పులు చేయాల్సింది ఏముంటుంది? రాజమౌళి సర్‌ చేసిన మ్యాజిక్‌లో ఎలాంటి మార్పులూ చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంటుంది. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆశించిన ఫలితమే దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపారు. 

e-max.it: your social media marketing partner