ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి 2015 ఎడిషన్‌లో రెండు కొత్తగా అభివృద్ధి పర్చిన ఏవియేటర్, ఆక్టివా ఐ ఆటోమెటిక్ స్కూటర్లను విడుదల చేసింది. దీంతో ఈ ఏడాదిలో ఆరు మాసాల్లోనే ఎనిమిది మోడళ్లను విడుదల చేశామని ఆ కంపెనీ ప్రెసిడెంట్ కితు మురమాత్సు తెలిపారు. ఈ ఏడాది మరో ఏడు మోడళ్లను విడుదల చేస్తామని చెప్పారు.