స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 24 పాయింట్ల లాభపడి 25,918 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 7865 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అటు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.201 పెరిగి రూ.27,440కు చేరింది. కిలో వెండి ధర రూ.724 తగ్గి రూ.35,476కు చేరుకుంది. డాలర్ మారకం విలువ రూ.66.51 పైసల వద్ద కొనసాగుతోంది.