ఆయిల్ కంపెనీలు మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్‌పై 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే డీజిల్ ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. లీటరు డీజిల్‌పై రూ.1.35ను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. పెంచిన పెట్రోల్ ధరలు, తగ్గిన డీజిల్ ధరలు అర్ధరాత్రి నుంచే అమలవుతున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగదారులకు మరింత భారం కానుంది.