తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర మరింత ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర దాదాపు 80 రూపాయలకు ఎగబాకింది..కొత్త పంట ఇంకారాకపోవడంతో సరఫరా తగ్గిపోవడమే ఉల్లిధరల పెరుగుధరలకు కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ముందు మందు ఉల్లి ఉత్పత్తి తగ్గే అవకాశలున్నాయన అంచనా వేస్తున్నారు.. దీని ప్రకారం ఉల్లి రేటు..ఘాటు మందు ముందు ఇంకా పెరిగే అవకాశలున్నయంటున్నారు విశ్లేషకులు..ఉల్లి రేటు పెరిగిపోవడంతో ప్రజలు ఉల్లి కోనేందుకు రైతుబజార్ల ముందు క్యూకడ్తున్నారు.. పెరిగిపోతున్న ఉల్లిధరలతో ప్రజల ఇక్కట్లను గుర్తించిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు..రైతుబజార్లలో ఉల్లి పాయలను కిలో 20 రూ. అందిస్తున్న విషయం తెల్సిందే.