పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టిన పసిడి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఐదేళ్ల కనిష్టస్ధాయిలో తగ్గుముఖం పడితే దేశీయ మార్కెట్ లో నాలుగేళ్ల కనిష్టస్ధాయికి పతనమయ్యాయి.
ధరలు మరింత తగ్గుతాయనే అంచనాతో ప్రజలు కొనుగోళ్లకు వెనుకాడుతుండటంతో డీలర్లు కూడా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. దీంతో పదిగ్రాముల బంగారం 25 వేల రూపాయల దిగువకు వచ్చింది. అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతుందనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి చిన్నబోయింది.