ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్.. దేశంలోని 296 పట్టణాల్లో 4జి సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో విడతల వారీగా ఈ సర్వీసులను పరీక్షిస్తూ వచ్చిన సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా వాణిజ్యపరమైన 4జి సేవలను అందిస్తోంది. ఈ నాలుగో తరం సేవలను దేశవ్యాప్తంగా అందిస్తున్న తొలి సంస్థ ఎయిర్‌టెల్ కావడం విశేషం. రిలయన్స్ జియో 4జి సేవల ప్రారంభానికి ముందే ఎయిర్‌టెల్ అన్ని రాష్ర్టాలకు విస్తరించేసింది.