హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ట్రెడా ప్రాపర్టీ షో హైటెక్స్‌లో ఈ రోజు నుంచి ఆదివారం వరకు
జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాను కూడా బిల్డర్‌నేనని.. బిల్డర్స్ సమస్యలు తనకు తెలుసని అన్నారు. సమాజం ఆర్థికంగా బాగుంటేనే బిల్డర్స్ అభివృద్ధి చెందుతారన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని కొనియాడారు. నిజాం కాలం తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేసింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరమే అని, హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఉందన్నారు. హైదరాబాద్ తాగునీటి కోసం నగరం చుట్టూ రెండున్నరేళ్లలో 65 రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నగరం నలువైపులా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.