దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంపై
కేంద్రంలో చలనం లేదని విమర్శించారు. ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలేమీ కనబడటం లేవన్నారు. అందుకు కేంద్రం వద్ద తనకంటూ ఓ విధానమే కనిపించడం లేదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్ధిక విధానాలే బాగుండేవని ఆయన ఆర్థిక విధానమే భేష్ అని పరకాల ప్రభాకర్ కొనియాడారు. ఈ మేరకు ఓ ఇంగ్లిషు డెయిలీకి పరకాల ప్రభాకర్ ఆర్టికల్ ఇచ్చారు. కాగా... ప్రస్తుతం పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.