ట్విట్టర్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించి 400 ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ పవన్ తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగానే ఈ ఘటనపై స్పందించిన జనసేనాని... ట్విట్టర్ ఈ విధంగా ఎందుకు చేసిందో తనకు తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే మా ఖాతాలను సస్పెండ్ చేశారా? అంటూ ట్విట్టర్ నిర్వహకులను ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి..? బ్లాక్ చేసిన తమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
కాగా... ట్విట్టర్ సస్పెండ్ చేసిన అకౌంట్లలో భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్‌పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్‌పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్‌పీకే వంటి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. అయితే... ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ విషయాలను, జనసేన పార్టీ కార్యక్రమాలను ట్విట్టర్ లో షేర్ చేస్తారు. జనసేనకు మంచి ఫాలోయర్స్ ఉండడంతో వీటికి భారీ సంఖ్యలో రీట్విట్లు, లైక్‌లు, కామెంట్లు కూడా పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. మరి, పవన్ కల్యాణ్ డిమాండ్‌పై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.