గురుగ్రామ్: మారుతి సుజుకి తన వాహన ఉత్పత్తి కేంద్రాలను మూసివేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా మారుతీ వాహనాల అమ్మకాలు పడిపోయాయని పేర్కొంటూ...
గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్(బీఎస్ఈ)కి ఆ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్ కూడా చేసింది. అందులో ఈ నెల 7వ, 9వ తేదీల్లో ప్లాంట్‌ను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీకి చెందిన వాహనాల అమ్మకాలు పడిపోవడంతో.. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.