ఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్ తమ భారత కస్టమర్లకు కొత్త మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు హ్యుండాయ్ గ్రాండ్ ఐ10
నియోస్ హచ్ బ్యాక్ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. కాగా ఈ కారు BS6 పెట్రోల్ ఇంజిన్ తో విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షల (పెట్రోల్) డీజిల్ రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.10 వేరియంట్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారును రూపొందించారు. ప్రస్తుతం సోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, రెడ్, అల్పా బ్లూ రంగుల్లో కారు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.