ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుతోంది. గంట గంటకి
వేగంగా క్షీణిస్తుండడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గత కొద్దీ రోజులుగా భారత్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా విదేశీ మదుపర్లు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంచే రూపాయి విలువ పడిపోయిన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది ఎంతోకాలం కొనసాగదని త్వరలోనే రూపాయి బలం పుంజుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.