ఢిల్లీ: ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ రోజు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన
సమీక్ష వివరాలను వెల్లడించింది. స్వల్పకాల రుణ వడ్డీరేటుతో 5.40శాతానికి చేరింది. దీంతో రివర్స్ రెపో రేటు 5.15 వద్దకు చేరింది. అలాగే... 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. తగ్గించిన ప్రస్తుత వడ్డీరేట్లు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం నింపుతాయని ఆర్థిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.