ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ ఆప్ వాట్సాప్ తమ యూజర్లు ఎప్పడి నుంచో ఎదురుచూస్తోన్న అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అదేంటంటే
'మల్టీ ప్లాట్‌ఫాం సిస్టమ్ ఫీచర్'. వాట్సాప్ యూజర్లు ఇప్పటి వరకు ఆండ్రాయిడ్, ఐఫోన్, లేదా ఐప్యాడ్.. ఇలా ఏ డివైస్ అయినా ఒక అకౌంట్‌ను ఒక డివైస్‌లో మాత్రమే వాడేందుకు అనుమతుండేది. కానీ ఈ కొత్త ఫీచర్ లో ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఇకపై ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. అంటే ఒకేసారి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. కాగా... ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది.