హైదరాబాద్: అమెజాన్ ఇండియా తమ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ ఆఫర్ ప్రకటించింది. 'ప్రైమ్ డే 2019' పేరుతో 18 దేశాలలో సుమారు
మిలియన్ ఒప్పందాలను అందిస్తోన్నట్లు పేర్కొంది. ఈ సేల్ జూలై 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ లో బాగా జనాదరణ పొందిన ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ గృహోపకరణాలతోపాటు మరికొన్ని ఉత్పత్తులకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ 48 గంటల వరకు ఉంటుంది. 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల వారికి రూ. 999కే వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా... ఈ మెంబర్‌షిప్ తీసుకున్న వినియోగదారులకు రూ.500 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.