ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్ విశ్వనాథన్ పదవీకాలం మరో ఏడాది పొడగింపబడింది. ఆయన నియామకాన్నీ
మరో ఏడాది వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఈరోజు ఆమోద ముద్ర వేసింది. కాగా ఈనెల 3 న ఆయన పదవీకాలం ముగియనుండగా... ఈనెల 4 నుంచి ఆయన నియామకం మరో ఏడాది అమల్లోకి రానుంది. కాగా... ప్రస్తుతం ఆర్బీఐలో ఉన్న ముగ్గురు డిప్యూటీ గవర్నర్లలో విశ్వనాథన్తో పాటు బీపీ కానుంగో, ఎంకే జైన్ ఉన్నారు.